బండి సంజయ్‌పై కరీంనగర్‌లో కేసు నమోదు – ఎఫ్‌ఐఆర్‌లో ఏముంది?
బండి సంజయ్ ఎఫ్‌ఐఆర్: బండి సంజయ్ ఎలాంటి నేరం చేశాడని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనలేదు. పేపర్ లీకేజీల వెనుక బండి సంజయ్ హస్తం ఉందని భారత రాష్ట్ర సమితి నేతలు ఆరోపిస్తున్నారు కానీ పోలీసులు మాత్రం ఎఫ్‌ఐఆర్‌లో అలాంటి ఆరోపణలు చేయలేదు. కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్ సీఐ లక్ష్మీబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన తర్వాత వికారాబాద్, కమలాపూర్‌లో ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలిపారు. అమాయక విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. బండి సంజయ్ వ్యవహారం శాంతిభద్రతల సమస్యలను రెచ్చగొట్టేలా ఉందని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల ముందు ధర్నాలు చేయాలని బండి సంజయ్ తన అనుచరులను ఆదేశించినట్లు తమకు సమాచారం అందిందని ఎఫ్‌ఐఆర్‌లో ఫిర్యాదు చేసిన ఇన్‌స్పెక్టర్ లక్ష్మీబాబు పేర్కొన్నారు. ఇది పరీక్షల ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నమని… విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినదని అన్నారు.
కమలాపూర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసి గుర్తు తెలియని వ్యక్తులకు పంపించారు. ఇది మాల్‌ప్రాక్టీస్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించడమే. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. పరీక్షలు సజావుగా సాగేందుకు.. శాంతిభద్రతల పరిరక్షణకు.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం బండి సంజయ్‌ను అరెస్టు చేయాల్సిన అవసరముందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అందుకే కరీంనగర్‌లోని అతని ఇంటి నుంచి అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.