MPHA: మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ వ్రాత పరీక్ష వాయిదా పడింది, కొత్త తేదీ త్వరలో ప్రకటించబడింది!
మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలు:
తెలంగాణలో ‘మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్’ పోస్టుల భర్తీకి నవంబర్ 10న జరగాల్సిన రాత పరీక్షను వాయిదా వేస్తున్నట్లు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. పరీక్ష కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని MHSRB తెలిపింది. రాత పరీక్ష, పని అనుభవం తదితర అంశాల ఆధారంగా ఉద్యోగాలను ఎంపిక చేస్తారు.సర్వీస్ వెయిటేజీ కింద ఇచ్చే మార్కులను కూడా 20 నుంచి 30 మార్కులకు పెంచారు.
తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ‘మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్’ పోస్టుల భర్తీకి జూలై 26న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 3 వరకు దరఖాస్తులు స్వీకరించారు.రాత పరీక్షను నవంబర్ 10న నిర్వహించాల్సి ఉండగా.. పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. మొదటగా మొత్తం 1520 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ప్రస్తుతం ఉన్న పోస్టులకు అదనంగా 146 పోస్టులు.. వైద్యవిధాన పరిషత్‌లో 265 పోస్టులు అదనంగా వచ్చాయి. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 1931కి చేరింది.
పోస్టుల వివరాలు..
మొత్తం ఖాళీలు: 1520
* మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళ) పోస్టులు
అర్హత: మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (మహిళ) శిక్షణ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి మరియు తెలంగాణ రాష్ట్ర నర్సులు మరియు మిడ్‌వైవ్స్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీ-పర్పస్ హెల్త్ వర్కర్ (మహిళ) శిక్షణా కోర్సులో ఉత్తీర్ణత మరియు ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక సంవత్సరం క్లినికల్ శిక్షణ పూర్తి చేశారు. (లేదా) గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ శిక్షణ పూర్తి చేసి ఉండాలి. తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
వయో పరిమితి: 01.07.2023 నాటికి 18 – 44 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు రుసుము: రూ.500. ప్రాసెసింగ్ ఫీజు-రూ.200; SC, ST, BC, EWS, PH & తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికోద్యోగులకు ప్రాసెసింగ్ రుసుము నుండి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, పని అనుభవం మొదలైన వాటి ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.
పరీక్ష విధానం: పరీక్ష OMR ఆధారిత లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్ష. పరీక్ష ఆంగ్లంలో నిర్వహించబడుతుంది.
పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్.
పే స్కేల్: రూ.31,040 – 92,050 చెల్లిస్తారు.
ఇంకా చదవండి:
VCRCలో 71 టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నీషియన్ పోస్టులు, వివరాలు క్రింది విధంగా ఉన్నాయి
ICMR-వెక్టార్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్, పుదుచ్చేరి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన టెక్నికల్ కేడర్‌లో రెగ్యులర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 71 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 08 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్ట్ వివరాల కోసం క్లిక్ చేయండి..
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు తప్పనిసరిగా ఈ అర్హతలు ఉండాలి
పూణెలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలి.
నంటిఫికేషన్, పోస్ట్ వివరాల కోసం క్లిక్ చేయండి..