National
గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు- రూ. 92 తగ్గించిన కేంద్రం
LPG సిలిండర్ ధరలు: ఏప్రిల్ 1న కేంద్రం ప్రజలకు శుభవార్త చెప్పింది. గ్యాస్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. LPG గ్యాస్ సిలిండర్ ధరలు సవరించబడ్డాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.92 తగ్గింది. గృహ వినియోగదారులకు ఎల్పీజీ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గత నెలలో దీనిని సవరించారు. 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సిలిండర్‌పై 50 రూపాయలు పెరిగింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.350 పెంచగా.. ఇప్పుడు రూ.92 తగ్గింది.