IBPS క్లర్క్ మెయిన్స్ – 2022 ఫలితాలు విడుదలయ్యాయి, ఇక్కడ డైరెక్ట్ లింక్!
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,035 క్లర్క్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 1న విడుదల చేసింది. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు ఐబీపీఎస్ ఫలితాలను ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ వివరాలను నమోదు చేయడం ద్వారా ఫలితాలను తనిఖీ చేయవచ్చు. ఫలితాల లింక్ ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. గత ఏడాది అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా క్లర్క్‌ల భర్తీకి ఐబీపీఎస్ మెయిన్ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
IBPS క్లర్క్ మెయిన్స్ ఫలితాలను డౌన్‌లోడ్ చేయడం ఎలా?
➥ IBPS అధికారిక వెబ్‌సైట్ ibps.in పై క్లిక్ చేయండి.
➥ అక్కడ హోమ్‌పేజీలో ‘CRP-Clerks-XII’ ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి. మీ స్క్రీన్‌పై కొత్త పేజీ కనిపిస్తుంది.
➥ అక్కడ అభ్యర్థులు లాగిన్ పేజీలో వారి రిజిస్ట్రేషన్ నంబర్ / రోల్ నంబర్, పాస్‌వర్డ్ / పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
➥ IBPS క్లర్క్ మెయిన్స్ ఫలితం తెరపై కనిపిస్తుంది. దీన్ని డౌన్‌లోడ్ చేయండి.
➥ భవిష్యత్తు ఉపయోగం కోసం ఫలితం యొక్క ప్రింటవుట్ తీసుకోండి.
తెలుగు న్యూస్9
IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఫైనల్ ఫలితాలు విడుదలయ్యాయి, ఇక్కడ డైరెక్ట్ లింక్!
దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 710 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఏప్రిల్ 1న ప్రకటించింది. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచబడ్డాయి. అభ్యర్థులు తమ నంబర్ లేదా రోల్ నంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ఫలితాలను తనిఖీ చేయవచ్చు. IBPS దేశవ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్‌లో ప్రిలిమ్స్ మరియు జనవరిలో మెయిన్స్ నిర్వహించింది. అభ్యర్థుల ఇంటర్వ్యూలు మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్ల తుది ఫలితాలను ప్రకటించింది. ఫలితాలు ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉంటాయి.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..
HSL: హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 43 ఖాళీలు, వివరాలు ఇక్కడ ఉన్నాయి!
హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL) విశాఖపట్నం వివిధ ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా వివిధ విభాగాల్లో శాశ్వత నియామకాల కింద మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు; డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, సీనియర్ అడ్వైజర్ మరియు సీనియర్ కన్సల్టెంట్ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 8న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా, శాశ్వత పోస్టులకు ఏప్రిల్ 6 వరకు, ఫిక్స్‌డ్ టర్మ్ పోస్టులకు ఏప్రిల్ 16 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా సమర్పించాలి. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్ట్ వివరాల కోసం క్లిక్ చేయండి.
REC లిమిటెడ్‌లో 125 ఉద్యోగాలు, అర్హతలు ఇవే!
REC లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 125 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/ గ్రాడ్యుయేషన్/ బీటెక్/ బీఈ/ డిప్లొమా/ సీఏ/ సీఎంఏ/ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ/ ఎంసీఏ/ ఎంటెక్/ ఎంఈ/ ఎంబీఏ/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 15గా నిర్ణయించబడింది.
నోటిఫికేషన్ పోస్ట్ వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి…