IAF అగ్నివీర్వాయు: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ‘అగ్నివీర్ వాయు’ అప్లికేషన్ ప్రారంభం, చివరి తేదీ ఎప్పుడు?:
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ పథకంలో భాగంగా ‘అగ్నివీర్ వాయు’ రిక్రూట్ మెంట్ కు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 17న ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్న అవివాహిత పురుషుడు మరియు స్త్రీలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఫిజిక్స్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వివరాలు..
* ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)- అగ్నిపథ్ స్కీమ్ అగ్నివీర్ వాయు (02/ 2023) రిక్రూట్‌మెంట్
అర్హత: ఇంటర్మీడియట్(10+2)/ఇంటర్మీడియట్(ఇతర నాన్-సైన్స్ సబ్జెక్ట్‌లు) లేదా మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా(మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఆటోమొబైల్/కంప్యూటర్ సైన్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)/ తత్సమానం కనీసం 50% మార్కులతో, గణితంలో ఫిజిక్స్ ఇంగ్లీష్ సబ్జెక్టులు. నిర్దిష్ట శారీరక దృఢత్వం/వైద్య ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.
వయో పరిమితి: 26.12.2002 నుండి 26.06.2006 మధ్య జన్మించి ఉండాలి.
ఎత్తు: పురుషులు 152.5 సెం.మీ; మహిళలు 152 సెం.మీ. ఉండాలి
దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి.
పరీక్ష రుసుము: రూ.250.
ఎంపిక ప్రక్రియ: ఫేజ్-1 (ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2 (ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3 (మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 17.03.2023.
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువు: 31.03.2023.
➥ ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం: 20.05.2023.
కూడా చదవండి:
CRPFలో 9212 కానిస్టేబుల్ పోస్టులు, పదో విద్యార్హతతో నెలకు రూ.69,100 వరకు జీతం!
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) భారీ ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ కేటగిరీల్లో మొత్తం 9212 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 424, తెలంగాణలో 301 ఖాళీలు ఉన్నాయి. 10వ తరగతి, ఐటీఐ అర్హత కలిగిన పురుష/మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 27న ప్రారంభమవుతుంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వీరి జీతం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో 1284 కానిస్టేబుల్ పోస్టులు, వివరాలు ఇలా!
భారత హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష మరియు ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఫిబ్రవరి 26 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇది మార్చి 27 వరకు కొనసాగుతుంది. అర్హులైన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులను సమర్పించాలి.
నోటిఫికేషన్, పోస్ట్ వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి…