రౌడీకి స్టార్ డైరెక్టర్ హ్యాండ్ ఇచ్చినట్లేనా..?
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో అగ్ర దర్శకుడు సుకుమార్ ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులైంది. ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కేదార్ సెలగం శెట్టి పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలిపారు. అయితే ఏళ్లు గడుస్తున్నా ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. అసలు అది కాదా అనేది కూడా ఎవరికీ అర్థం కావడం లేదు.
వాస్తవానికి ‘పుష్ప’ సెట్స్‌పై ఉండగానే విజయ్ దేవరకొండ-సుకుమార్ సినిమా ప్రకటన వచ్చింది. పుష్ప సెకండ్ పార్ట్ తీసే ఆలోచన అప్పట్లో లేకపోవడంతో అల్లు అర్జున్ సినిమా పూర్తయిన వెంటనే వీడీ సినిమాను ప్రారంభించాలని సుక్కు ప్లాన్ చేశాడు. అయితే ‘పుష్ప’ రెండు భాగాలుగా రూపొందబోతుంది.. మొదటి భాగం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ప్లాన్లన్నీ మారిపోయాయి.
ఖుషీ తర్వాత విజయ్‌డి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చేతులు కలపనున్నారు. అదేవిధంగా విజయ్ లైన్‌అప్‌లో ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు కూడా ఉంటాడని టాక్. మరోవైపు ‘పుష్ప: ది రూల్’ తర్వాత సుకుమార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ భారీ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీడి – సుక్కు ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
సుకుమార్ – విజయ్ దేవరకొండ సినిమా సెట్స్ పైకి వెళ్లడం లేదని.. అసలు ఈ ప్రాజెక్ట్ ఉండకపోవచ్చనే రూమర్స్ అప్పట్లో వినిపించాయి. అయితే, ఈ పుకార్లను ఖండిస్తూ ఫాల్కన్ క్రియేషన్స్ టీమ్ ఓ నోట్ విడుదల చేసింది. దర్శక హీరోల ఇతర కమిట్ మెంట్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుందని.. ఈ కాంబినేషన్ మరింత పెద్దగా ఉండబోతోందని అంటున్నారు. 2022లోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలిపారు. కానీ పరిస్థితులు మారాయి.
సుకుమార్ ప్రాజెక్ట్ పూర్తిగా క్యాన్సిల్ అయిందనే పుకార్లు ఇప్పుడు విజయ్ దేవరకొండ అభిమానులను నిరాశకు గురిచేస్తున్నాయి. లిగర్ సినిమా హిట్ అయితే రౌడీ కెరీర్ మరోలా ఉండేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు శివ నిర్వాణ, గౌతమ్ తిన్ననూరి సినిమాలతో తన సత్తా చాటుతాడనే నమ్మకంతో ఉన్నారు. భవిష్యత్తులో సుక్కుతో వీడీ సినిమా ఉంటుందనే నమ్మకం ఉంది. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.